పోలీస్ శాఖకు పేరు తెచ్చేలా పనిచేయాలి
పెదవేగి: పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపిక కావడం అదృష్టమని, విధి నిర్వహణలో పోలీస్ శాఖకు పేరు తెచ్చేలా పనిచేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. సోమ వారం పెదవేగి డీటీసీ ట్రైనింగ్ సెంటర్‌లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన 142 మంది ట్రైనింగ్ కానిస్టేబుళ్లు రిపోర్ట్ చేశారు. ముఖ్య అతిథిగా ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఏ చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు ప్రతిఒక్కరూ ఆయా విషయాలపై అవగాహనను కల్పించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ కొత్త చట్టాలు, సైబర్ క్రైమ్, ఐటీ కోర్‌లో ఉద్యోగ నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు. డీటీసీ ప్రిన్సిపాల్, ఏఎస్పీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఒక్క పోలీస్ శాఖకు మాత్రమే ఉందన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షేక్ మస్తాన్, డీఎస్పీలు ఎం.వెంకటేశ్వరరావు, యు.రవిచంద్ర, డి.శ్రావణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


