18 రోజులు.. రూ.1.75 కోట్లు
చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని స్థానిక ప్ర మోద కల్యాణ మండపంలో సోమవారం లె క్కించారు. శ్రీవారికి విశేష ఆదాయం సమకూ రింది. గత 18 రోజులకు గాను నగదు రూపేణా రూ.1,75,47,176 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 138 గ్రాముల బంగారం, 4.574 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.500, రూ.2,000 నోట్ల ద్వారా రూ.1,13,000 లభించాయన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్ హె చ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసి) పిలుపులో భాగంగా సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలన్నారు. సొసైటీ ఉద్యోగులకు జీఓ 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ, సిబ్బందిని కుదించే ఆలోచనలు మానుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా యూనియన్ నాయకులు కేవీవీ సత్యనారాయణ, టి.గంగరాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసిసిబి, ఆప్కాబ్ తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సీహెచ్ సుందరయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, యూనియన్ ప్రధాన కార్యదర్శి పూజారి సుబ్బారావు, కోశాధికారి జి.వీరయ్య, తూర్పుగోదావరి జిల్లా యూనియన్ ఉపాధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరావు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని మోదీ సర్కారు మతం ముసుగులో జీ రామ్ జీ పథకంగా మార్చడాన్ని ఖండించారు. కేంద్రం ఉపాధి పథకాన్ని 11 ఏళ్లుగా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి కుదించడం, ఉపాధి హామీ చట్టాన్ని రానున్న రోజుల్లో రద్దు చేసే ఆలోచనే అన్నారు. రాష్ట్రం వాటాను 40 శాతానికి పెంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని కోరారు. జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసే వరకూ వామపక్ష పార్టీలు కలిసొచ్చే పార్టీలను, సంఘాలతో ఉద్యమిస్తాయని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామకృష్ణ, కె.శ్రీనివాస్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర నాయకులు కాకి నాని, బీకేఎయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు.
18 రోజులు.. రూ.1.75 కోట్లు


