అర్జీలు పునరావృతం కాకూడదు
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లో జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వర రావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవితో కలిసి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీలపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. ఒకే ఫిర్యాదుపై అర్జీలు పునరావృతం అవుతున్నాయని, కాకుండా చూడాలన్నారు. మొత్తంగా 352 అర్జీలు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని..
● మండవల్లి మండలం నిచ్చుమిల్లికి చెందిన గొంతుకుపులి జయరాజు తమ గ్రామంలో 37 ఎకరాలు పంచాయతీ కరకట్టు పుంత ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు.
● టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన ఆళ్ల వెంకటరామారావు తాను పెద్ద పేగు క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారని, సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు.
● పోలవరం మండలం పైడాకులమామిడికి చెందిన కొవ్వాసు గంగాధరరావు చెక్ డ్యాములకు నిధులు మంజూరు చేయాలని వినితపత్రం అందించారు.
● నాచుగుంటకు చెందిన కాజ సత్యనారాయణ పంచాయతీని విభజన చేయాలని కోరారు.
పుష్కరాలకు ప్రణాళికలు
జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రణాళిక లు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించా రు. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తామన్నారు.


