రియల్.. ఢమాల్
న్యూస్‌రీల్
తగ్గిన ఆదాయం
గత ప్రభుత్వంలో జోరుగా..
జిల్లాలో రిజిస్ట్రేషన్లు
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది. క్రయవిక్రయాలు మందగించి రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యాన్ని చేరుకోవడం గగనమవుతోంది. గతంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అమ్మేవారున్నా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడమే స్థిరాస్తి రంగం కుదేలవ్వడానికి కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలంటున్నాయి. జిల్లాలోని పట్టణ, మండల కేంద్రాలు, సమీప గ్రామాల్లో వెయ్యికి పైగా లేఅవుట్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ అపార్ట్‌మెంట్లు పుట్టుకొచ్చాయి. స్థలాలు, ప్లాట్లు క్రయ విక్రయదారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడేవి. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల పరిధిలో నెలకు 10 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అంచనా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీటి సంఖ్య 15 వేలకు పైబడి ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 10 వేలలోపే జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అటకెక్కించడంతో జనం వద్ద డబ్బుల్లేక మార్కెట్‌లో మనీ రొటేషన్ తగ్గింది. వ్యాపారుల పరిస్థితి దిగజారింది. ప్రతికూల వాతావరణం, దళారుల దోపిడీతో జిల్లాలో ప్రధానమైన ఆక్వా, వరిసాగులో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు గణ నీయంగా తగ్గిపోయాయి. సైట్లు అమ్ముడుపోక అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా కొనే వారు లేక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో నెలకు రెండు, మూడు ప్లాట్లు అయినా విక్రయించే వారు కొంతకాలంగా ఒక్క ప్లాటు కూడా విక్రయించలేని పరిస్థితి ఉందని మీడియేటర్స్ అంటున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 63 శాతం మాత్రమే ఆదాయం లక్ష్యం నమోదైంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ఉండి, మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా జిల్లాలోని మిగిలిన 13 చోట్ల ఆదాయం లక్ష్యం 48 శాతం నుంచి 70 శాతంలోపే ఉంది. మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్టు ఫిబ్రవరి నుంచి భూముల విలువను 10 నుంచి 40 శాతం వరకు పెంచడం రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. చార్జీల పెంపుతో ఉన్న అరకొర మొత్తాన్ని ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం రిజిస్ట్రేషన్లు మందగించడానికి కారణంగా చెబుతున్నారు.
2019 నుంచి 2024 మధ్య కాలం స్థిరాస్థి రంగానికి స్వర్ణయుగం అయ్యింది. విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో గత ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. అన్నివర్గాల వారికి మేలుచేసేలా అమలుచేసిన సంక్షేమ పథకాలు వారి ఆదాయాన్ని మరింత పెంచాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రభుత్వ సహకారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి స్థిరాస్థి రంగంలో కొనుగోళ్లు పెరిగాయి. గత ఐదేళ్లలో ఏటా ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యం 70 శాతానికి తగ్గలేదు. కరోనా విలయతాండవం చేసిన 2020, 2021లో సైతం 76 శాతం నుంచి 95 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకుంది.
నేలచూపులు
చంద్రబాబు సర్కారులో రియల్ ఎస్టేట్ పతనం
స్థిరాస్తి రంగంలో మందగించిన క్రయవిక్రయాలు
జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు
గత ఆర్థిక సంవత్సరంలో 63 శాతమే చేరుకున్న లక్ష్యం
సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం లక్ష్యం వచ్చిన మొత్తం శాతం
(రూ.కోట్లల్లో) (రూ.కోట్లల్లో)
2020–21 85,620 318.9 241.26 76
2021–22 1,23,536 365.59 361.68 99
2022–23 1,39,731 486.79 380.37 78
2023–24 1,83,180 517.13 399.66 70
2024–25 98,790 616.76 388.22 63
రియల్.. ఢమాల్
రియల్.. ఢమాల్


