వైజ్ఞానిక ప్రదర్శనలతో సైన్స్‌పై ఆసక్తి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తిని పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఉన్న అవగాహన ఎగ్జిబిట్లతో కనిపిస్తుందన్నారు. 7 విభాగాల్లో 141 ప్రాజెక్టులు, వ్యక్తిగత ప్రాజెక్టులు 42, టీచర్ ప్రాజెక్టులు 15, మొత్తం 324 మంది విద్యార్థులు, 198 మంది టీచర్లు హాజరయ్యారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక : పి.రేవతి, కె.విజయలక్ష్మి (ప్రగడవరం హైస్కూల్), కె.పవన్‌కుమార్, జె.సిరి (గార్లమడుగు జీహెచ్), కె.నవ్యశ్రీ, ఎ.అనుశ్రీ (కొత్తపల్లి హైస్కూల్), బి.గాయత్రి, ఎస్.శరణ్య (చాటపర్రు హైస్కూల్), కె.నాగదుర్గా శ్రీ (బుసరాజుపల్లి ఏపీటీడబ్ల్యూర్ ఎస్‌జీహెచ్‌ఎస్), బి.భానుశ్రీ, ఎం.భార్గవి (నూజివీడు హైస్కూల్), ఎస్. చందు, ఎం.మోహన పవన్‌కుమార్ (రావికంపాడు), ఎన్.హేమశ్రీ (శోభనాపురం హైస్కూల్), జి.లోకేష్ (కై కరం హైస్కూల్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే టీచర్ల విభాగంలో దెందులూరు హైస్కూల్‌కు చెందిన ఎండీ హసీనాబేగం, కోరుకొల్లు హైస్కూల్‌కు చెందిన పి.శ్రీలక్ష్మి ఎంపికయ్యారు. డీఈఓ వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.


