మన్యం బంద్ ప్రశాంతం
కుక్కునూరు: పోలవరం నియోజకవర్గంలోని మండలాల్ని పోలవరం జిల్లాలో కలపాలని కోరుతూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్బంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా బంద్‌ను ఉద్దేశించి ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బంద్‌లో సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరం సంజీవరావు, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు కాక ఆనంద్, నవదీప్, తదితరులు పాల్గొన్నారు.
వేలేరుపాడు మండలంలో..
వేలేరుపాడు: రంపచోడవరం కేంద్రంగా ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గ లేకపోవడంతో మండలంలో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి సాధన కమిటీ ఆధ్వర్యంలో గుల్లవాయీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో సదస్సు జిల్లా సాధన కమిటీ సభ్యుడు మడివి దుర్గారావు అధ్యకతన జరిగింది. నాయకులు ధర్ముల రమేష్, ఊకె ముత్యాలరావు, సొడే సీతారామయ్య, కారం వెంకట్రావు, మడకం ఏసుబాబు, పొట్ల మోహన్, మిరియాల శ్రీను, కట్టి ఉదయ్‌లు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసిత ప్రాంతం అంతా ఒక జిల్లాగా ప్రకటిస్తానని ఇచ్చిన హామీ విస్మరించి, పోలవరం జిల్లాని ప్రకటించటం నియోజకవర్గ ప్రజలను నిరాశ పరచడమేనని విమర్శించారు. నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వాలంటే పోలవరం నియోజకవర్గంని కలిపి పోలవరం జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరాటం ప్రకాష్, కుడియం రాజు, రాంబాబు, ప్రేమ కుమార్, కొత్త వెంకటేశ్వర్లు, మల్లేష్, నాగు రాముడు తదితరులు ఉన్నారు.
పోలవరం మండలంలో..
పోలవరం రూరల్: పోలవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాలో కలపాలని సీపీఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఏజెన్సీ బంద్ కార్యక్రమంలో మండలంలో షాపులను మూయించి నిరసన వ్యక్తం చేశారు. ఏటిగట్టు సెంటర్‌లో నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటిస్తానని మాటిచ్చి మాట తప్పారని, పోలవరం నియోజకవర్గం లేకుండా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం అన్యామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జిల్లాను ఏర్పాటు చేయడం తగదన్నారు. సీపీఎం నాయకులు బొరగం భూ చంద్రరావు, సముద్రాల సాయికృష్ణ, తామా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
టి.నరసాపురం మండలంలో..
టి.నరసాపురం: మండలంలో ఉన్న 18 గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలని సీపీఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ మండలాలను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసే పోలవరం జిల్లాలో కలపాలని ఏజెన్సీ మండలాల బంద్‌లో భాగంగా సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో టి.నరసాపురంలో బంద్‌కు మద్దతు తెలిపారు. మల్లప్పగూడెం గ్రామంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం లేదని ఇప్పుడైనా ఏజెన్సీ ప్రాంతం కలుపుతూ టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్న 28 గిరిజన గ్రామాలను రంపచోడవరం పోలవరం జిల్లాలో కలపాలని గ్రామాలన్నింటికి గిరిజన భారత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేశారు.
మన్యం బంద్ ప్రశాంతం
మన్యం బంద్ ప్రశాంతం


