నేషనల్‌ గేమ్స్‌లో మధురశ్రీకి ద్వితీయ స్థానం | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ గేమ్స్‌లో మధురశ్రీకి ద్వితీయ స్థానం

Dec 23 2025 7:02 AM | Updated on Dec 23 2025 7:02 AM

నేషనల

నేషనల్‌ గేమ్స్‌లో మధురశ్రీకి ద్వితీయ స్థానం

నేషనల్‌ గేమ్స్‌లో మధురశ్రీకి ద్వితీయ స్థానం నాటుసారా స్థావరంపై దాడి శ్రీవారికి నీరాజనాలు శతాధిక కవి సమ్మేళనంలో ప్రతిభ బీరు సీసాతో స్నేహితుడిపై దాడి పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

కొయ్యలగూడెం: నేషనల్‌ లెవల్‌ సెపక్‌ తక్రా పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని ద్వితీయ స్థానం సాధించిందని వీఎస్‌ఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ స్వామి సోమవారం తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న పాక మధురశ్రీ జోధ్‌పూర్‌లో అండర్‌–17 విభాగంలో పోటీల్లో పాల్గొని విజయం సాధించిందన్నారు. మధురశ్రీని ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సమీపంలో నాటుసారా స్థావరంపై ఎకై ్సజ్‌ అధికారులు సోమవారం దాడి చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనుబాబు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

ద్వారకాతిరుమల: తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు సోమవారం పూజలు నిర్వహించి, నీరాజనాలు సమర్పించారు. చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ తిరువీధి సేవను కన్నులపండువగా జరిపారు. ఆ తరువాత ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో శ్రీవారికి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలను పంపిణీ చేశారు.

తణుకు అర్బన్‌: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న అమలాపురంలో నిర్వహించిన 160వ శతాధిక కవి సమ్మేళనంలో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్‌ ప్రతిభ చూపించారు. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పేరుతో ఆయన రాసి చదివి వినిపించిన కవితకు కవితా హృదయాల నుంచి విశేష స్పందన లభించింది. కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌, జాతీయ అధ్యక్షుడు జి.ఈశ్వరి భూషణం, డాక్టర్‌ కావూరి శ్రీనివాసశర్మ, బొంతు వీవీ సత్యనారాయణ తదితరులు కవి ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.

కై కలూరు: మద్యం మత్తులో స్నేహితుడిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటన వరహాపట్నం మద్యం దుకాణం వద్ద సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం రాచపట్నంకు చెందిన పెనుమాల వాసు, వరహాపట్నానికి చెందిన తోట రాజేష్‌ స్నేహితులు. రాజేష్‌ వరహాపట్నం బ్రాందీ దుకాణం వద్ద మద్యం మత్తులో మరొకరితో గొడవ పడుతుండగా.. అటుగా వెళ్తున్న వాసు రాజేష్‌కు సర్ది చెప్పాడు. కోపంతో బీరు సీసాతో వాసు తలపై రాజేష్‌ కొట్టాడు. తీవ్ర గాయాలైన వాసును కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకెళ్ళారు.

పెదవేగి: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగిన వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై హరిగోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన కొలుసు ఉమామహేశ్వరరావు(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 21న తీవ్ర కడుపునొప్పి రావడంతో పురుగుల మందు తాగాడని, చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

నేషనల్‌ గేమ్స్‌లో  మధురశ్రీకి ద్వితీయ స్థానం 
1
1/2

నేషనల్‌ గేమ్స్‌లో మధురశ్రీకి ద్వితీయ స్థానం

నేషనల్‌ గేమ్స్‌లో  మధురశ్రీకి ద్వితీయ స్థానం 
2
2/2

నేషనల్‌ గేమ్స్‌లో మధురశ్రీకి ద్వితీయ స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement