గంగానమ్మను దర్శించుకున్న ‘చాంపియన్’ టీం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో జరుగుతున్న గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం చాంపియన్ చిత్ర హీరో, హీరోయిన్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్రం ప్రమోషన్ యాత్రలో భాగంగా నగరానికి విచ్చేసిన హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ అమ్మవారి మేడల వద్దకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమలు, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పెదవేగి: తాగి వస్తున్నావంటూ భార్య నిలదీయడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెదవేగి ఎస్సై హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన గొర్రెల అప్పారావు(44) రోజు మద్యం తాగి వస్తుండటంతో భార్య మాధఽవి ప్రశ్నించింది. దీంతో అతను ఈ నెల 21న పురుగులమందు తాగడంతో స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పారావు సోమవారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంగానమ్మను దర్శించుకున్న ‘చాంపియన్’ టీం


