వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ
దెందులూరు: కాంగ్రెసేతర ప్రభుత్వంతోనూ దేశంలో అద్భుతమైన సుపరిపాలన అందించడం సాధ్యమని నిరూపించిన ధీశాలి అటల్ బిహారీ వాజ్ పేయి అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కొనియాడారు. సోమవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం హాస్పిటల్ సెంటర్ వద్ద మాజీ ప్రధాని వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని అన్నామలై, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీఅటల్–మోడీ సుపరిపాలన యాత్రశ్రీలో భాగంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రితో పాటు మంత్రి కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): అగ్రవర్ణాల వేధింపులు, అరాచకాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పేరూరుకు పుట్టి శివభాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బాధితుడు మాట్లాడుతూ తన 6.64 ఎకరాల భూమి హద్దులను రైతులు బొప్పన రామలింగేశ్వరరావు, అతని అనుచరులు తొలగించి అక్రమంగా ప్రవేశించి చేపల చెరువు త్రవ్వే ప్రయత్నం చేశారని, తన చెరువును వారికి లీజుకి ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. నిరాకరించడంతో స్థానిక ఎస్సై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సంబంధిత రైతులతో రాజీ కుదుర్చుకోవాలని బెదిరిస్తున్నారన్నారు.


