ఏం చేశారని.. మా కోసం | - | Sakshi
Sakshi News home page

ఏం చేశారని.. మా కోసం

Nov 25 2025 10:30 AM | Updated on Nov 25 2025 10:30 AM

ఏం చే

ఏం చేశారని.. మా కోసం

చికెన్‌ సరిపోవడం లేదని.. నిరుపయోగంగా అగ్రి ల్యాబ్‌లు ఆర్‌బీకేలు నిర్వీర్యం అయ్యో.. రొయ్య

న్యూస్‌రీల్‌

చికెన్‌ సరిపోవడం లేదని..
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో చికెన్‌ అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 8లో u
రైతును రాజు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ఉచిత పంటల బీమాకు ఎసరుపెట్టి అన్నదాతకు ధీమా లేకుండా చేశారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్నివిధాలా అండగా ఉన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆక్వాకు రూ.1.50 సబ్సిడీ విద్యుత్‌ హామీ ఊసేలేదు. సాగులో రైతుకు భరోసా లేకుండా చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో హడావుడి చేస్తోంది.

మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతుపై వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవ గాహన కార్యక్రమాల పేరిట మరో గారడీకి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోయినా ఇప్పుడు ఈ ప్రచార ఆర్భాటమేంటని రైతులు అంటున్నారు.

ఏడాది సాయానికి ఎగనామం

జిల్లా అంతటా ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అన్నదాత సుఖీభవ సా యంగా ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ఊదర గొట్టారు. మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టిన ప్రభుత్వం రెండో ఏడాది నుంచి అరకొర మందికి సాయం అందించి చేతులు దులుపుకుంటోంది. ప్రస్తుతం జిల్లాలో 1,03,761 మంది రైతులకు ఈ ఏడాది సాయం అందిస్తుండగా.. తొలి ఏడాదికి గాను జిల్లాలోని రైతులు రూ.207.52 కోట్లు నష్టపోయినట్టు అంచనా. మరోపక్క కౌలు రైతులను ఎలాంటి సాయం అందించకుండా గాలికొదిలేసింది.

పంటల బీమా.. లేదు ధీమా

రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్‌ నుంచి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. ప్రతి ఎకరాకు బీమా వర్తించడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులతో పాటు కౌలు రైతులకు పూర్తి పరిహారం అందేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ. 210లు చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉన్నాయి.

ప్రాధాన్యం మరిచి.. రైతులను వంచించి..

ధాన్యం కొనుగోళ్లలో దళారులే ఇప్పుడు తెరవెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. తేమశాతం ఎక్కువనో, తాలుగింజలు ఉన్నాయనో కోత పెడుతున్నారు. గత రబీలో తొలుత 6 లక్షల టన్నులు మాత్రమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల టన్నులకు పెంచింది. కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంచుల కొరత వేదిస్తోంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని చెప్పి గత సీజన్‌ చివరిలో దాదాపు నెలన్నర రోజులు జాప్యం చేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.

నకిలీల బెడద అరికట్టేందుకు గత ప్రభుత్వం రూ.కోటి వ్యయంతో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది. జిల్లాలోని భీమవరం, ఉండి, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ల్యాబ్స్‌ నిర్మించారు. రైతులు శాంపిల్స్‌ తెస్తే చాలు వ్యవసాయం, మత్య్సశాఖ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించి అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొన్నిచోట్ల ఇవి నిరుపయోగంగా ఉన్నాయి.

విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకూ సాగులో రైతుకు అన్నివిధాలా అండగా గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. కొన్ని ఆర్‌బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆక్వా రైతులందరికీ రూ.1.50లకే సబ్సిడీ విద్యుత్‌ అందిస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఆక్వా జోన్‌లో వాటికేనంటూ మెలిక పెడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడం, సిండికేటు దోపిడీతో నష్టాలు భరించలేక ఈ ఏడాది ప్రారంభంలో పాలకొల్లు, ఆచంట, నరసాపురంలోని ఆక్వా రైతులు క్రాఫ్‌ హాలీడే ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

కొయ్యలగూడెం బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

నిండా మునిగిన రైతు

ఉచిత పంటల బీమాకు ఎసరు

ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యం

అన్నదాత సుఖీభవకు మొదటి ఏడాది ఎగనామం

రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్య కుదింపు

మీకోసం పేరుతో ప్రచార ఆర్భాటం

ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం

ఏం చేశారని.. మా కోసం 1
1/5

ఏం చేశారని.. మా కోసం

ఏం చేశారని.. మా కోసం 2
2/5

ఏం చేశారని.. మా కోసం

ఏం చేశారని.. మా కోసం 3
3/5

ఏం చేశారని.. మా కోసం

ఏం చేశారని.. మా కోసం 4
4/5

ఏం చేశారని.. మా కోసం

ఏం చేశారని.. మా కోసం 5
5/5

ఏం చేశారని.. మా కోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement