ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ 2025 ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయాలని, సమస్యలతో డీఈఓ కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయుల వినతుల స్వీకరణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఏలూరు కార్పొరేషన్‌లో పండిట్స్ అప్‌గ్రేడేషన్‌కు చర్యలు తీ సుకోవాలని, కొందరు హెచ్‌ఎంలు ఉపాధ్యాయులకు అనారోగ్యంగా ఉన్నా సెలవులు ఇవ్వడం లే దన్నారు. గతేడాది టెన్త్ వంద రోజుల ప్రణాళిక అ మలులో సెలవు రోజుల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కు సీసీఎల్ ఎనేబుల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రా మారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ నసభ్యుడు ఎస్‌కే రంగావలి, జిల్లా కార్యదర్శి డీకేఎస్‌ఎస్ ప్రకాష్ రావు, సీ నియర్ నాయకులు ఎన్. కొండయ్య, నగర ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు ఉన్నారు.


