నేడు వైఎస్సార్‌సీపీ యువజన విభాగ సమావేశం
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశాన్ని తణుకులో నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తణుకు పద్మశ్రీ ఫంక్షన్‌లో హాలులో జరిగే సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నూతన కమిటీలు, యువజన విభాగ బలోపేతం తదితర కీలక అంశాలపై చర్చిస్తామని వివరించారు.
ఏలూరు (టూటౌన్): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్నేపల్లి తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర కులగణను తక్షణమే నిర్వహించాలన్నారు. ప్రతి కుటుంబం సామాజిక ఆర్థిక, రాజకీయ స్థితిగతులన్నింటినీ తెలుసుకునేలా సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. రా జ్యాంగ సవరణ చట్టం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీ,ఈలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ల్లో చేర్చి పరిరక్షించాలన్నా రు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి, ఓ బీసీ మహిళాలకు వారి జనాభా దామాషా ప్ర కారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఉన్నత న్యాయస్థానాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొ లువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం శంకుస్థాపనలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. దేవదా య శాఖ నిధులు రూ.3.50 కోట్లతో ఆలయ ప్రదక్షిణ మండపం, పంచాయతీరాజ్ రోడ్‌అసెట్స్ నిధులు రూ.3.70 కోట్లతో నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కేపీ శివకిషోర్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): తాడేపల్లిగూడెంలో ని మాగంటి అన్నపూర్ణదేవి మున్సిపల్ హై స్కూల్‌లో ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటన లో గాయపడి వైద్యం పొందుతున్న 8వ తర గతి విద్యార్థిని హాసినిని సోమవారం ఆమె తల్లిదండ్రులు అంబులెన్స్‌లో భీమవరం కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అంబులెన్స్ వద్దకు వెళ్లి బాలిక ఆరోగ్యంపై ఆరా తీశారు. హాసినికి రెండు కాళ్లు విరిగి, ద వడ ఎముకకు గాయమైందని, వైద్య కోసం చా లా ఖర్చు చేశామని, ఇక ఖర్చు చేయలేమని త ల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. ముందుగా హాసిని కుటుంబసభ్యులు, బంధు వులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నేడు వైఎస్సార్‌సీపీ యువజన విభాగ సమావేశం


