అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8లో u
చంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తిగా వంచించి పాలన సాగిస్తోంది. జోన్‌లతో నిమిత్తం లేకుండా ఆక్వా చెరువులు అన్నింటికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. సిండికేట్ దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విత్తు నుంచి ధాన్యం విక్రయించుకునే వరకూ వరి రైతులది అదే పరిస్థితి. ఏదో ఉద్దరించినట్టుగా ఇప్పుడు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది.
– వడ్డి రఘురాం, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తాడేపల్లిగూడెం
ఐదు ఎకరాలు కౌలు సాగు చేస్తున్నాను. మమ్మల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అన్నదాత సుఖీభవ సాయం అందడం లేదు. కనీసం బీమా సాయం కూడా అందించలేని పరిస్థితి ఉంది. గతంలో బీమా బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు విపత్తులతో రైతులు నష్టపోతూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు.
– గొట్టుముక్కల ఏసురత్నం, తూర్పుపాలెం
షష్ఠి ఉత్సవాలకు ముస్తాబు


