బార్లకు నో టెండర్స్
మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ..
పొలిటికల్ రింగ్
మద్యం సిండికేట్ల బ్లాక్ మెయిల్
న్యూస్‌రీల్
ఏలూరు నగరంలో 4 బార్లకే టెండర్లు ?
ఉచిత బస్సు.. ప్రయాణం తుస్సు
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పలు బస్సు సర్వీసులను రద్దు చేసి ఇక్కట్లకు గురిచేస్తోంది. 8లో u
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి సర్కారు నూతన బార్ పాలసీ బెడిసికొట్టింది. భారీగా టెండర్లు వేస్తారనీ... సర్కారుకు భారీగా ఆదాయం వస్తుందనే ఆశలు ఫలించలేదు. పైగా కూటమి పార్టీల్లోని నేతలు, మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి టెండర్లు వేయకుండా ఒత్తిడి పెంచుతూ డిపాజిట్లు తగ్గించేలా కొత్త డ్రామాకు తెరతీశారు. లైసెన్సు ఫీజులు తగ్గించామని, బార్ల టైమింగ్స్ సైతం పెంచటంతో భారీ ఎత్తున టెండర్లు వస్తాయని అంచనా వేయగా... పూర్తిగా మద్యం సిండికేట్లు వ్యూహంలో భాగంగానే టెండర్లు వేయకుండా గేమ్ ప్లాన్ చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏలూరు జిల్లాలో ఓపెన్, కల్లు గీత కులాలకు సంబంధించి 20 బార్లకు నోటిఫికేషన్ జారీచేయగా.. శనివారం కలెక్టర్ వెట్రిసెల్వి లాటరీ విధానంలో బార్ల లైసెన్సులకు అనుమతులు ఇస్తూ ఎంపిక చేశారు. 10 బార్లకు టెండర్లు వేయకుండా ఊహించని రీతిలో మద్యం సిండికేట్లు అధికారులకు షాకిచ్చారు.
సిండికేట్ల స్కెచ్ : నిర్ణీత గడువులోగా టెండర్లు వేయకుండా అడ్డుకుంటే... ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందనీ, ఎవరూ ముందుకు రాకుండా ఉంటే.. చివరికి ప్రభుత్వమే దిగివచ్చి తక్కువ డిపాజిట్లు, లైసెన్సు ఫీజులతో బార్లకు అనుమతులు ఇస్తుందనే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు మద్యం దుకాణాలను సైతం కూటమి పార్టీల నేతలే దక్కించుకుని, మద్యాన్ని ఏరులై పారిస్తూ.. జేబులు నింపుకుంటున్న తరుణంలో బార్లను సైతం చేజిక్కించుకోవాలనే పక్కా వ్యూహంతోనే కూటమి నేతలు టెండర్లు వేయకుండా బ్లాక్ మెయిలింగ్‌కు దిగినట్లు టాక్ నడుస్తోంది.
శ్రీవారికి మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న దంపతులను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 8లో u
కూటమి పార్టీలకు చెందిన నేతలు, మద్యం వ్యాపారులు ప్రైవేటు మద్యం దుకాణాల ఎంపికల్లోనూ బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లతో మద్యం షాపులను చేజిక్కించుకున్నారు. అదే తరహాలో నూతన బార్ పాలసీలోనూ తమదైన శైలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం.. మరోవైపు టెండర్లు వేయకుండా అడ్డుకోవటం, బార్ల నిర్వహణ కష్టంగా మారిందంటూ చెబుతూ.. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ తక్కువ ధరలకే బార్లను దక్కించుకునే పన్నాగం పన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏలూరులో జనాభా ప్రాతిపదికన ఏడాదికి బార్ లైసెన్సు ఫీజు రూ.55 లక్షలుగా నిర్ణయించారు. ఒక టెండరు వేసేందుకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ రూ.5 లక్షలుగా చెప్పటంతో తక్కువ సొమ్ముకే బార్లను సొంతం చేసుకోవాలనే యత్నాలు కూటమి పార్టీ సిండికేట్లు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.
కూటమి పార్టీలకు చెందిన మద్యం సిండికేట్లు డిపాజిట్లు, బార్ లైసెన్సు ఫీజులను భారీగా తగ్గించేలా ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 18న ఏలూరు జిల్లాలో 18 ఓపెన్, 2 కల్లుగీత కులాలకు బార్లు కేటాయిస్తూ... టెండర్లు వేసేందుకు ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 26తో దరఖాస్తులు వేసేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించగా.. జిల్లాలో కనీసం 4 బార్లకు కూడా టెండర్లు దాఖలు కాలేదు. చేసేది ఏం లేక ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచింది. 28 వరకూ గడువు పెంచినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి 30న టెండర్లు పరిశీలించి.. 10 బార్లకు మాత్రమే లాటరీ విధానంలో టెండర్లు ఖరారు చేశారు. మరో 10 బార్లకు టెండర్లు వేయకుండా మద్యం సిండికేట్ అడ్డుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
మద్యం షాపుల కేటాయింపులో సిండికేట్లుగా మారి కూటమి నేతలు దోచుకోగా.. ఇప్పుడు బార్ల టెండర్లులోనూ సిండికేట్లు షాకిచ్చారు. దీంతో ఏలూరు జిల్లాలో 10 బార్లకు టెండర్లకు వేయనివ్వకుండా రింగ్ అయ్యారు. చివరకు 10 బార్లకే లాటరీ తీశారు.
ఏలూరు జిల్లాలో 18 ఓపెన్ కేటగిరీ, మరో రెండు కల్లుగీత కులాలకు బార్లను కేటాయించారు. ఏలూరులో 11 ఓపెన్, 1 కల్లుగీత కులానికి బార్లను కేటాయించారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయ తీలో 2 ఓపెన్, 1 కల్లుగీత కులానికి, నూజివీడు మున్సిపాల్టీలో 4 బార్లు, చింతలపూడి నగర పంచాయతీలో ఒక ఓపెన్ కేటగిరీ బార్‌ను కేటాయించారు. ఏలూరు నగరంలో పాతవి 10 బార్లు ఉండగా, తాజా బార్ పాలసీలో మరో రెండు పెంచారు. ఏలూరులో ఓపెన్ కేటగిరీలో 3 బార్లకు, కల్లుగీత కులానికి కేటాయించిన మరొక బార్‌కు ...మొత్తానికి 4 బార్లకు మాత్రమే టెండర్లు వేశారు. గరిష్టంగా కల్లుగీత కులానికి కేటాయించిన బార్‌కు మాత్రమే 5 టెండర్లు వేయగా, మిగిలిన వాటిలో మూడింటికీ ఒక్కో దానికి 4 చొప్పున మాత్రమే టెండర్లు వేశారు. జంగారెడ్డిగూడెంలో గరిష్టంగా కల్లుగీత కులానికి కేటాయించిన బార్‌కు 13 టెండర్లు వేశారు. నూజివీడులో 2 బార్లకు టెండర్లు వేయగా మరో బార్‌కు దరఖాస్తులేమీ దాఖలు కాలేదు, జంగారెడ్డిగూడెంలో ఒక బార్‌కు టెండర్లు పడలేదు, చింతలపూడిలోని ఒక్క బార్‌కు టెండర్లు వేయగా లాటరీలో ఎంపిక చేశారు.
సర్కారుపై సిండికేట్ ఒత్తిడి
టెండర్లు వేయకుండా పొలిటికల్ రింగ్
ఏలూరు జిల్లాలో 10 బార్లకే టెండర్లు
ఏలూరు నగరంలో 12కి 4 బార్లకు మాత్రమే టెండర్లు
బార్లకు నో టెండర్స్
బార్లకు నో టెండర్స్


