చెత్త తొలగించారు
ఆగిరిపల్లి: స్థానిక కొలిమి బజార్‌లో పేరుకుపోయిన చెత్తను పంచాయతీ సిబ్బంది శనివారం తొలగించారు. శుక్రవారం సాక్షిలో ‘చెత్తను తొలగించండి’ కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మి ఆధ్వర్యంలో కొలిమి బజార్‌లోని హై స్కూల్, రైస్ మిల్లు వద్ద ఉన్న చెత్తను తొలగించారు.
చింతలపూడి: ఖమ్మం జిల్లా, బేతుపల్లి నుంచి తమ్మిలేరు రిజర్వాయర్‌కు శనివారం స్వల్పంగా వరద కొనసాగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు వద్దే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 348.7 అడుగులకు చేరుకుంది. గోనెలవాగు స్టోరేజ్ ట్యాంక్ నీటిమట్టం 348 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ కె.లాజర్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 800 క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వార ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని రామకోటి సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్‌లో ఇంటర్ విద్యార్థులకు జువాలజీ లెక్చరర్‌ను, పెదవేగిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌లో కామర్స్ లెక్చరర్‌ను నియమించాలని కోరుతూ పీడీఎస్‌ఓ నాయకులు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన హై స్కూల్ ప్లస్‌లలో లెక్చరర్ లేక, తరగతులు జరగక ఇబ్బంది పడుతున్నారని, ఈ కారణంగా విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఏలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్‌లో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులను ప్రవేశపెట్టి, అందుకు అవసరమైన తరగతి గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం : పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బుడిపుల సుబ్బారావు అదృశ్యమయ్యారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్బారావు కామవరపుకోట జంక్షన్ నుంచి చింతలపూడి రోడ్డుకు మోటార్ సైకిల్‌పై వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. తడికలపూడి, టి.నరసాపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుబ్బారావు ఎస్‌బీలో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం సుబ్బారావు సెల్‌ఫోన్ సిగ్నల్స్ జంగారెడ్డిగూడెం తాడువాయి సెల్ టవర్ పరిధిలో గుర్తించి, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సుబ్బారావు ఆచూకీ తెలియలేదు. సుబ్బారావు మిస్సింగ్‌పై ఆయన భార్య పద్మమాలిని ఫిర్యాదు చేయగా, తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపై జంగారెడ్డిగూడెం డీఎస్‌పీ యు.రవిచంద్ర మాట్లాడుతూ సుబ్బారావు అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
చెత్త తొలగించారు


