
మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ పోటీలు
భీమవరం: మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ పోటీలు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం త్రీ టౌన్‌లోని ఓ.12 జిమ్‌లో ఆదివారం నిర్వహించారు. పోటీలను దాసి వరప్రసాద్ ప్రారంభించగా, బాడీ బిల్డింగ్ మొదటి గ్రూపు విజేతలకు మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసు బహుమతులు అందించారు. నిర్వాహకుడు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ విభాగంలో మిస్టర్ భీమవరం విజేతగా ఎస్‌కె యాసీన్, ఫిజిక్ మోడలింగ్ విభాగంలో మిస్టర్ భీమవరం విజేతగా సతీష్ నిలిచారని తెలిపారు.