
ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వేధింపులు
కై కలూరు: గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌గా తనకు ఏ మాత్రం గౌరవం లేకుండా కూటమి సానుభూతిపరులతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని నత్తగళ్లుపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కై కలూరులో విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనలో జగనన్న లేఅవుట్‌లో 42 మంది పేదలకు నత్తగుళ్లపాడులో స్థలాలకు 3 ఎకరాలు రూ.40 లక్షలతో పూడిక చేశానన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి స్థలాలను పంపిణీ చేయడం లేదన్నారు. దీని సమీపంలో 37, 38 39, 40 సర్వే నెంబర్లలో కొల్లేరు అభయార్యణంలో అక్రమ చేపల సాగు చేస్తోన్నారన్నారు. అన్ని అనుమతులతో పూడ్చిన భూమిని పంపిణి చేయని అధికారులు అక్రమ సాగుపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అక్రమ సాగు సమస్యలపై అర్రజీ ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కూటమి పార్టీకి చెందిన బలే ఏసురాజు తనపై కక్ష కట్టారని.. తన వాహనాల టైర్లను అతని సానుభూతిపరులు ధ్వంసం చేశారన్నారు. కొల్లేరులో ఏసు బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.
నత్తగుళ్లపాడు సర్పంచ్ ఆవేదన