
బయటకు వెళ్లాలంటే భయమేస్త్తోంది
ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి హల్‌చల్ చేస్తున్నారు. అడిగితే దాడికి పాల్పడుతున్నారు. గత వినాయక చవితికి చాలా గొడవలు జరిగాయి. మళ్లీ ఏగొడవలు జరుగుతాయోనని భయంగా ఉంది. శనివారం రాత్రి సైరన్ మోగుతోందని పోలీసులు వచ్చారనుకున్నాం. ఓ యువకుడు బైక్‌పై పోలీసు సైరన్‌లో హడావుడి చేశాడు. ఇదంతా టీడీపీ నాయకులే నడిపిస్తున్నారు. – భారతి, లేఅవుట్ కాలనీ, జంగారెడ్డిగూడెం
కూటమి అధికారంలో వచ్చిన తరువాత టీడీపీ నాయకుడు వచ్చి ఇక్కడ తాను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. శనివారం రాత్రి యువకులతో కలిసి వచ్చి నా తల పగులగొట్టారు. వినాయకుడి గుడి కట్టిస్తుంటే అవినీతి అంటూ ఆరోపిస్తున్నారు. నేను చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటే నా నుంచి రూ. 50 వేలు లంచం తీసుకున్నారు. మరో రూ.50 వేలు అడుగుతున్నారు.
– పకీర్ నాయుడు, లేఅవుట్ కాలనీ, జంగారెడ్డిగూడెం

బయటకు వెళ్లాలంటే భయమేస్త్తోంది