వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు

Aug 17 2025 6:39 AM | Updated on Aug 17 2025 6:39 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు ఉచిత బస్సు.. అంతా తుస్సు అధికారులకు షోకాజ్‌ నోటీసులు 3 టన్నుల కూరగాయలు అందజేత న్యాయవాదులకు హెల్త్‌ కార్డులివ్వాలి

పాలకొల్లు సెంట్రల్‌: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు కవురు శ్రీనివాస్‌ను నియమించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ తనకు పలు పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కమ్యూనిటీ సంఘ పెద్దలు, సభ్యులను కలుపుకుని పార్టీన మరింత బలో పేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు పూర్తిగా గమనించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు అన్నారు. శని వారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూపర్‌సిక్స్‌ అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, వాటిలో అనేక కొర్రీలు ఉన్నాయని అన్నారు. మహిళల కోసం పెట్టిన ఫ్రీ బస్సు అంతా తుస్సే అని అన్నారు. ఉచిత బస్సుకు ఐదేళ్లలో రూ.8 వేల కోట్లు అవుతుందని ప్రకటించారని, ఇది కేవలం కంటి తుడుపు చర్యగా కనిపిస్తుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌ మహిళలకు పెద్దపీట వేశారని, వైఎస్సార్‌ చేయూత కింద సుమారు రూ.19 వేల కోట్లు, వైఎస్సార్‌ ఆసరా కింద రూ.27 వేల కోట్లు, ఇళ్ల పథకానికి సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. ఫ్రీ బస్సుకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చవుతుందని కూటమి నాయకులు చెప్పుకోవడమే తప్ప ఈ ఫ్రీ బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణించే పల్లె బస్సులకు సరైన మార్గదర్శకాలు లేవన్నారు. ఇక్కడ పథకం ఉన్నా లేనట్టే అన్నారు. కూటమి పాలకులు పథకాల పేరుతో ప్రజలను దగా చేస్తున్నారన్నారు.

దెందులూరు: ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులు దూరం’ అన్న శీర్షినక శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. దెందులూరులో వేడుకలు నిర్వహించని పశుసంవర్ధక శాఖ ఏడీ, ఎంఈఓలకు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ గోవిందరావు, డీఈఓ వెంకట లక్ష్మమ్మ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. స్వాతంత్ర దినోత్స వాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించక పోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, సంబంధిత అధికారుల వివరణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు నూజివీడుకు చెందిన దాత నక్కా సత్యనారాయణ శనివారం 3 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. దొండ, బెండ, దోస, సొర, టమోటాలు వంటి పలు రకాల కూరగాయలను అందజేసి, స్వామివారి అన్నప్రసాదంలో వినియోగించాలని కోరారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్‌ కార్డులు ఇవ్వాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం శనివారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగింది. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారని, అయితే రాష్ట్రంలో 1,275 మంది న్యా యవాద వృత్తిలో మృతి చెందితే 103 మందికి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు 
1
1/2

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు 
2
2/2

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement