
గౌతు లచ్చన్న ఆదర్శనీయులు
ఏలూరు(మెట్రో): స్వాతంత్య్ర సమరయోధుడు, సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం గౌతు లచ్చన్న జయంతి వే డుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ, వీవీ గిరి, నేతాజీ వంటి ఎందరో నాయకులతో కలిసి గౌతు లచ్చన్న స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నారు. అలాగే బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ: జిల్లాలో 30 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో ముంపునకు కారణమవుతున్న నక్కల కా లువ మురుగు డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డి మాండ్ చేశారు. ఆచంట, పెనుగొండ మండలాల్లో ముంపు చేలను శనివారం ఆయన పరిశీలించారు. శేషమ్మ చెరువు, మార్టేరు, తూర్పుపాలెం, నెగ్గిపూడి, కొఠాలపర్రు, సోమరాజు చెరువు గ్రామాల్లో పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు.