
ఏలూరు రైల్వేస్టేషన్‌లో మొబిలైజేషన్ డ్రిల్
ఏలూరు (టూటౌన్): ఏలూరు రైల్వేస్టేషన్‌లో గురువారం సాయంత్రం రైల్వే ఎస్పీ పి.సైమన్, ఏలూరు ఆర్‌పీఎఫ్ సీఐ, ఎస్సై ఇతర సిబ్బందితో మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. బెదిరింపులు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, ప్రతిస్పందనను తనిఖీ చేయడం ఈ డ్రిల్ లక్ష్యం అని వివరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత భద్రతా పరిస్థితులపై కూడా సిబ్బందికి వివరించారు.
ఆంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజ
జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతిని పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో గురువారం ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం విశేష పూజల అనంతరం శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణం, సాయంత్రం గుర్వాయిగూడెం, చక్రదేవరపల్లి గ్రామాల్లో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు.
నిందితుడికి రిమాండ్
భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయలంలో కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలిని కొట్టడంతో మృతి చెందిన కేసులో నిందితుడైన మృతురాలి మనవడు తోట మధును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండు విధించి తణుకు ఉప కారాగారానికి పంపించారని సీఐ జి.కాళీచరణ్ తెలిపారు.

ఏలూరు రైల్వేస్టేషన్‌లో మొబిలైజేషన్ డ్రిల్