మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
డీఎస్పీ ప్రసాద్ హెచ్చరిక
నూజివీడు : మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి మైనర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనలను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి శనివారం రాత్రి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నడపమని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపైనా, వాహన యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఎవరైనా మైనర్లు బైక్‌లు నడుపుతుంటే రూ.5 వేల జరిమానాతో పాటు బైక్‌ను స్వా ధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్ల డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పట్టణ సీఐ పి.సత్యశ్రీనివాస్‌ను అభినందించారు.
నేడు ఇన్‌చార్జి మంత్రి రాక
ఏలూరు (మెట్రో): జిల్లా ఇన్‌చార్జి మంత్రి నా దెండ్ల మనోహర్ సోమవారం జిల్లాకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 22న బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, రౌతుగూడెం, బర్రెంకలపాడు, చంద్రన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పా ల్గొంటారు. కేఆర్‌పురంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. 23న పులిరామన్నగూడెం, బుట్టాయగూడెంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఏలూరు చేరుకుని కలెక్టరేట్‌లో జరిగే ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
మాలలకు కూటమి ద్రోహం
పెనుగొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని మాల సంఘాల జేఏసీ నాయకుడు ఉన్నమట్ల మునిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆచంట మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొడమంచిలి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల ఆక్రోశానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి కులాల మధ్య చిచ్చుపెట్టడమే తప్ప సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు. ఆర్డినెన్స్‌కు టీడీపీ మాల నాయకులు మ ద్దతు పలకడం మాలజాతికి ద్రోహం చేసినట్లేన ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ సుంకర సీతారామ్, గౌరవాధ్యక్షుడు బీరా మధు, మండల జేఏసీ నాయకుడు కోట వెంకటేశ్వరరావు, జెంట్రీ శ్రీను, మట్టా చంటి, గుండే నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పేద ముస్లింల కోసమే వక్ఫ్ చట్టం
భీమవరం: పేద ముస్లింలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ముద్రించిన వక్ఫ్ సవరణ చట్టం ప్రయోజనాలను తెలియజెప్పే కర పత్రాలను ఆయన ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 20 వేల కరపత్రాలను అన్ని మండలాల అధ్యక్షులకు పంపిస్తామని, ముస్లింలలో ఈ చ ట్టంపై ఉన్న సందేహాలు తొలగిపోయేలా అన్ని వివరాలు ఇందులో పొందుపరిచినట్టు జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు


