
మామిడి పండుగ.. ఉత్సాహంగా..
బుట్టాయగూడెం: మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి లయబద్ధంగా డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న మామిడికాయ, బాట పండుగ, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని కొండరెడ్డి గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాది వేసవికాలంలో తాము జరుపుకునే పండుగకు సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం గ్రామస్తులందరూ చందాలుగా వేసుకోవడంతోపాటు కొంతసొమ్ము ప్రజల నుంచి వసూలు చేసి వాటితో పండుగ జరుపుకుంటున్నామని కొండరెడ్డి గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ పంటలను గుర్తించి ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
గిరిజన సంప్రదాయ పండుగలను
ప్రభుత్వం గుర్తించాలంటున్న కొండరెడ్లు

మామిడి పండుగ.. ఉత్సాహంగా..