
● వరలక్ష్మీ.. వరప్రదాయినీ
అనివేటి మండపంలో వేదికపై వ్రత వేడుక జరిపిస్తున్న అర్చకులు
అమ్మవారికి నీరాజనాలు అర్పిస్తున్న భక్తులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని వేంచేపు చేశారు. అర్చకులు, పండితులు ఉత్సవమూర్తికి విశేష పుష్పాలంకారాలు చేసి వ్రత పూజ ప్రారంభించారు. అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సుమారు 3 వేల మందికి పైగా మహిళలు వ్రత వేడుకల్లో పాల్గొని అమ్మవారిని పూజించారు. వేడుక అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, రవికలు, ప్రసాదాన్ని అర్చకులు అందించారు. ముందుగా ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి సతీమణి అమ్మవారికి పసుపు, కుంకుమలు, పూలు, పండ్లను అందజేశారు. ఈఓ సత్యనారాయణమూర్తి, డీఈఓ భద్రాజీ, ఏఈఓలు పి.నటరాజారావు, మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్లు జి.సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ద్వారకాతిరుమలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

● వరలక్ష్మీ.. వరప్రదాయినీ