
అంకాలమ్మ
ఏలూరు టౌన్: ఏలూరు నగర శివారులోని ఒక ప్రాంతానికి చెందిన మతిస్థిమితంలేని బాలిక పై 70 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో నిందితుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. నగర శివారు లోని ఓ ప్రాంతానికి చెందిన బాలికకు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్తుండగా బాలిక ఒంటరిగా ఇంటి వద్దనే ఉంటుంది.ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు పెద్దింటి కనకరాజు బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి జామకాయలు కొనిస్తానంటూ ఆశ చూపించి ఇంటి పక్క సందులోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పని నుంచి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు రూరల్ ఎస్సై రాజారెడ్డి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాముకాటుతో వార్డు సభ్యురాలి మృతి
జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని పేరంపేట పంచాయతీ 1వ వార్డు సభ్యురాలు, వైఎస్సార్‌సీపీ నాయకురాలు రాజనాల అంకాలమ్మ ( 50) బుధవారం పాము కాటుతో మృతి చెందారు. తన మొక్కజొన్న చేలో కండెలు విరిచే పనిలో నిమగ్నమై ఉండగా అంకాలమ్మ పాము కాటుకి గురైంది. ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంకాలమ్మకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అంకాలమ్మ కుటుంబ సభ్యులను జెడ్పీటీసీ సభ్యుడు పోల్నాటి బాబ్జి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కఠారి సీతారాంబాబు, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు పరామర్శించారు.