
అర్జీలు స్వీకరిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ లావణ్యవేణి
ఏలూరు(మెట్రో): జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తిస్థాయిలో సత్వర పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ బి.లావణ్యవేణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కేఎస్‌ఎస్ సుబ్బారావు, ఆర్డీఓ ఎన్‌ఎస్‌కే ఖాజావలి, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 228 అర్జీలు వచ్చాయని, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 18 ఏళ్లు నిండిన విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయడంపై దృష్టి సారించాలన్నారు.