
కై కలూరు: దళిత జాతి ఆరాధ్య దైవం అయిన బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల దళితులు రాజకీయ పదవులు పొందుతున్నారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. స్థానిక తాలూకా సెంటర్‌లో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సొంత నిధులతో చేపట్టిన అంబేడ్కర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి ఆదివారం మోషేన్‌రాజు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మోషేన్‌రాజు మాట్లాడుతూ అంబేడ్కర్ వల్లే 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు లభించిందన్నారు. అంబేడ్కర్ అందరి వారని అన్నారు. ఎమ్మెల్యే డీఎన్నార్ మాట్లాడుతూ దళితుల దశాబ్దాల కలను నిజం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ వెంకటరమణ మాట్లాడుతూ అంబేడ్కర్ భవనం అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ముందుగా తాలూకా సెంటర్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయకులు నివాళులర్పించారు. రాష్ట్ర వడ్డీల వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సైదు గాయత్రీ సంతోషి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఘంటా సంధ్య, ఎంపీపీ అడవి కృష్ణ, జెడ్పీటీసీలు కురేళ్ల బేబీ, రామిశెట్టి సత్యనారాయణ, బొర్రా సత్యవతి, ఏఎంసీ చైర్‌పర్సన్ దండే పుష్పలత, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మండలి చైర్మన్ మోషేన్‌రాజు, చిత్రంలో ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ