బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో టీవీ చానల్స్‌

ఉల్కా టీవీ లాంఛనంగా ప్రారంభం : ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ - Sakshi

ఏలూరు (టూటౌన్‌): డిజిటల్‌ టెలివిజన్‌ చానల్స్‌కు రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏలూరు బిజినెస్‌ ఏరియా, సిటీ ఆన్‌లైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా డిజిటల్‌ టెలివిజన్‌ చానల్స్‌ ప్రసారం చేయడం అభినందనీయమని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ అన్నారు. ఉల్కా టీవీ బ్రాండ్‌ పేరుతో ఉన్న సిటీ ఆన్‌లైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఐపీ నెట్‌వర్క్‌ ద్వారా అందించే కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడుతూ ఒకే కనెక్షన్‌తో మూడు రకాల సేవలు అందిచడం గొప్ప విషయమన్నారు. ఏలూరు బిజినెస్‌ ఏరియా జీఎం ఎల్‌.శ్రీను మాట్లాడుతూ డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా చానల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సిటీ ఆన్‌లైన్‌ మీడియా డైరెక్టర్‌ రాఘవరావు, ఐబీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ ఆర్‌ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top