నల్లమిల్లి వాసి మృతి
అమలాపురం రూరల్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో అమలాపురం మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన అమిలిశెట్టి సూరి సత్యనారాయణ (40) మృతి చెందారు. అయ్యప్ప మాలలో ఉన్న ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళుతుండగా, ఆదివారం రాత్రి ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన వారికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సత్యనారాయణ కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌లో కొబ్బరి వ్యాపారం చేసేందుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడి నుంచే ఆయన శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని గ్రామ మాజీ సర్పంచ్ గోకరకొండ వాసు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అమలాపురం తాలూకా పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు.


