అనపర్తి: క్రీడల్లో ఎటువంటి పరిచయం లేని విద్యార్థి డిస్కస్ త్రోలో మొదటి ప్రయత్నంలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. అనపర్తి మండలం రామవరం ఎన్‌ఎమ్మార్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పలివెల హరిచంద్ర మనోహర్ ఇటీవల రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన జిల్లా స్థాయి డిస్కస్ త్రో అండర్ – 14 విభాగంలో ప్రతిభ చాటాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుని రాష్ట్ర స్థాయికి అర్హత సాధించాడు. కాగా.. మనోహర్‌తో పాటు అతడికి శిక్షణనిచ్చిన పీడీ ప్రియాంకను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అభినందించారు.


