● 81 ఏళ్ల వయసులో పోటీకి సై | - | Sakshi
Sakshi News home page

● 81 ఏళ్ల వయసులో పోటీకి సై

Nov 18 2026 12:14 AM | Updated on Nov 18 2026 12:14 AM

● వేసిరా ఓటు..

ఎన్నికల్లో దొంగ ఓట్లను అరికట్టడానికి సిరా చుక్క ఎంతో కీలకం. ఎన్నికల్లో ఓటర్ల చూపుడు వేలుపై పూసే సిరాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తారు. ఇది కొన్ని రోజుల పాటు చెరగదు. 2006 ఫిబ్రవరి నుంచి జరిగిన ఎన్నికల్లో ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు కింద ఉండే చర్మంపై గుర్తుపెట్టడం ప్రారంభించారు.

● బ్యాలెట్స్‌ రెడీ

పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్‌ పెట్టెలు సిద్ధమయ్యాయి. వీటిని ఇప్పటికే మండల పరిషత్‌ కార్యాలయాల్లో అధికారులు పరిశీలించి రెడీగా ఉంచారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా విభజించి అధికారులకు అందజేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల ముందు రోజు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు,

● వేలం రుజువైతే శిక్షార్హులే..

సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు వేలం నిర్వహిస్తే శిక్షారులని 1994 పంచాయతీరాజ్‌ చట్టంలో ఉంది. అదే జరిగితే సెక్షన్‌ 2,11 (1), ఏపీ పీనల్‌ కోడ్‌ 171 (బీ), 171 (ఈ) కింద అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదు చేస్తారు. వేలం రుజువైతే శిక్షతో పాటు సదరు అభ్యర్థిని ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటారు. అలాగే ఎన్నిక నిలిపివేసి నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆర్వో అందజేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

– అంబాజీపేట

తిమ్మాపురం గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యురాలుగా 81 ఏళ్ల గిడితురు సుబ్బలక్ష్మి నామినేషన్‌ వేశారు. వైఎస్సార్‌ సీపీ మాజీ సర్పంచ్‌, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ సర్పంచ్‌గా బలపరిచిన ముద్దన సీతామహాలక్ష్మి ప్యానల్‌లో ఈమె వార్డు సభ్యురాలి అభ్యర్థిగా ఉన్నారు. ఎనిమిది పదుల వయసులోనూ ఉత్సాహంగా ఎన్నికల్లో పోటీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

– కాకినాడ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement