నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): గుజరాత్‌లో ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే జాతీయ స్థాయి జూనియర్స్ ఖోఖో పోటీలకు కాకినాడ డీఎస్‌ఏలో శిక్షణ పొందుతున్న ఆర్.లలితాదేవి, రంగా మహాలక్ష్మి ఎంపికయ్యారని డీఎస్‌డీఓ వి.సతీష్ కుమార్ మంగళవారం తెలిపారు. కాకినాడ ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్న వీరు గుడివాడలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల ఖోఖో పోటీలలో ప్రతిభ కనబర్చారన్నారు.
సాఫ్ట్ బాల్ పోటీలకు రాషిత
పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–19 ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 22 వరకు ఛండీఘర్‌లో జరిగే జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు కాకినాడ జిల్లాకు చెందిన బండారు రాషిత ఎంపికై ంది. ఆమె అక్టోబర్ 11 నుంచి 13 వరకు పశ్చిమగోదావరి జిల్లా పెదవేమగిరి ఏపీ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–19 అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపింది. ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచింది. రాషిత ప్రతిభను గుర్తించిన ఎంపిక కమిటీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసింది. కాకినాడలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న రాషితను కళాశాల చైర్మన్ వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ భానుప్రియ, అధ్యాపకులు అభినందించారు.


