దివ్యాంగులపై ప్రభుత్వం చిన్న చూపు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులపై ప్రభుత్వం చిన్న చూపు

Nov 18 2026 12:14 AM | Updated on Nov 18 2026 12:14 AM

అమలాపురం టౌన్‌: దివ్యాంగులను కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రాష్ట్ర దివ్యాంగుల మహా సంఘటన్‌ అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్‌ రోడ్డులో పలు దివ్యాంగ సంఘాల నాయకులు మంగళవారం సమావేశమై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై చర్చించారు. జిల్లా దివ్యాంగుల ఐక్య జేఏసీ చైర్మన్‌ పెనుమాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సురేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో దివ్యాంగులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా గుర్తింపు ఉంటుందన్న సూచనలు కనిపించడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనైనా అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో దివ్యాంగులు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పీడబ్ల్యూడీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకట ప్రసాద్‌, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు నాగవరపు పరశురాముడు, జాతీయ అఖిల భారత దివ్యాంగుల ఐక్య జేఏసీ కార్యదర్శి కొమ్ముల కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వ రాయితీలను సకాలంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరిగా తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దివ్యాంగుల ఐక్య జేఏసీ జాతీయ కార్యదర్శి కోటేశ్వరరావుకు సంఘాల జిల్లా ప్రతినిధులు అందించారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థిని అదృశ్యం

అమలాపురం టౌన్‌: అమలాపురం పట్టణానికి చెందిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం పట్టణ సీఐ పి.వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్థిని సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. అప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement