వేలిముద్రలే పట్టించాయి | - | Sakshi
Sakshi News home page

వేలిముద్రలే పట్టించాయి

Nov 18 2026 12:14 AM | Updated on Nov 18 2026 12:14 AM

కాకినాడ క్రైం: కాకినాడ గోల్డ్‌ మార్కెట్‌ సెంటర్‌లోని బంగారం, వెండిని కరిగించే దుకాణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీని పోలీసులు చేధించారు. ఆ వివరాలను కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ కిషోర్‌ కుమార్‌ మంగళవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. దుకాణంలోకి రాత్రి వేళ చొరబడిన దొంగ రూ.10 లక్షలతో పాటు వెండి కడ్డీలను దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఘటనా స్థలంలో వేలిముద్రల ఆధారంగా దొంగ సూర్యనారాయణపురానికి చెందిన బీర దుర్గా వెంకటేష్‌ అని గుర్తించారు. ఇంటి వద్ద అతడిని అరెస్టు చేయగా, నివాసంలో 1.6 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ విషయంపై ఆరా తీయగా, స్నేహితుడు కాకర లోవరాజు కొనుగోలు చేసి విక్రయిస్తాడని వెల్లడించాడు. తమలో ఎవరు అరెస్టు అయినా బయట ఉన్న వ్యక్తి విడిపించేందుకు ప్రయత్నించాలనే ఒప్పందంతో దోచిన, గంజాయి విక్రయించిన సొమ్మును అన్ని వేళల్లో చెరో సగం పంచుకునేవారని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. బీర దుర్గా వెంకటేష్‌పై 21 కేసులు, కాకర లోవరాజుపై 28 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి రూ.10.15 లక్షల నగదు, తొమ్మిది వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయి, పది ఉన్ని స్వెట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేయగా సీఐలు కేవీఎస్‌ సత్యనారాయణ, మజ్జి అప్పల నాయుడు బృందం , క్రైం ఇన్‌స్పెక్టర్‌ పీవీ త్రినాథ్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, గోవిందు బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించి కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేసు చేధించడంతో ఎస్పీ బిందుమాధవ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

● చోరీ కేసును చేధించిన పోలీసులు

● ఇద్దరు నిందితుల అరెస్టు

● నగదు, వెండి, గంజాయి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement