పెదపూడి: జి.మామిడాడ జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–19 బాలుర, బాలికల కబడ్డీ, సెపక్ తక్రా క్రీడా ఎంపికలు ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగాయి. వీటికి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారిలో కబడ్డీకి 12 మంది బాలురు, 12 మంది బాలికలు, సెపక్ తక్రాకు 5 బాలురు, 5 బాలికలను జట్లకు ఎంపిక చేశారు. వీరు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలురు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అప్పలాచారి, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వెంకటరెడ్డి, పిడి నల్లమిల్లి అప్పారెడ్డి తదితరులు అభినందించారు.


