చంద్రవరం ఓట్లను రీకౌంటింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

చంద్రవరం ఓట్లను రీకౌంటింగ్‌ చేయాలి

Nov 8 2026 12:37 AM | Updated on Nov 8 2026 12:37 AM

● ఏకపక్షంగా అధికారుల వ్యవహారశైలి

● వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి అన్యాయం

● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

చాగల్లు: చంద్రవరం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి అన్యాయం చేశారని, వివాదాస్పదంగా మారిన ఓట్లను పునఃపరిశీలించి రీకౌంటింగ్‌ నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో చంద్రవరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి సత్యనారాయణకు అన్యాయం జరిగిందని, ఈ వ్యవహారంలో ఎన్నికల అధికారుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కౌంటింగ్‌లో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అధికారులను కూటమి నాయకులు బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా వ్యవహరించేలా చేశారని ఆరోపించారు. చెల్లని ఓట్లుగా గుర్తించిన 18 ఓట్లలో రెండింటిని టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పరిగణించి, వాటిని కలిపి గెలుపును ప్రకటించారన్నారు. కొవ్వూరు ఏఎంసీ చైర్మన్‌ నాదెళ్ల శ్రీరామ్‌, ఎన్నికల అధికారులు సీహెచ్‌ శ్రీనివాస్‌, రామకృష్ణ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య ఎన్నికల విధానాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్‌ నిర్వహించి వాస్తవ ఫలితాన్ని వెల్లడించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement