నా చేలో పంటను ఈ వారంలో కోయాల్సి ఉంది. సమయానికి తుపాన్లు వచ్చి నష్టాన్ని మిగిల్చాయి. ఎకరాను రూ. 40 వేలకు కౌలుకు తీసుకుని, మరో రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి వరి పండించాను. గతేడాది ఖరీఫ్‌లో మొంథా తుపాను సమయంలో 10 ఎకరాల్లో పంట పూర్తిగా పాడైపోయింది. అధికారులు వచ్చి నమోదు చేశారు గానీ ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎప్పటి పంట నష్ట పరిహారం అప్పుడే ఇచ్చేది. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
– జగతా సత్యనారాయణ, కౌలు రైతు, చిట్యాల, గోపాలపురం మండలం


