గల్లంతైన విజయకుమార్‌ ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన విజయకుమార్‌ ఎక్కడ?

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

● అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల

ఆందోళన

● చెట్టు కొమ్మ ఆసరాగా

ప్రాణాలు దక్కించుకున్న మహిళ

● పట్టించుకోని పోలీసులు, అధికారులు

దేవరపల్లి: గోపాలపురం మండలం చిట్యాల సమీపంలోని కొవ్వాడ కాలువ లో గల్లంతైన బ్యాంకు అప్రైజర్‌ విజయకుమార్‌ ఆచూకీ ఇంత వరకు లభించలేదు. దీంతో కు టుంబ సభ్యులు ఆందోళ న చెందుతున్నారు. అతడితో పాటు బైక్‌పై వెళ్తు న్న మహిళ పద్మ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె చిట్యాలలోని మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌ సీపీ నాయకుడు పీతల ప్రసాద్‌ బాబు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్నూలుకు చెందిన పద్మ పది రోజుల క్రితం తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో ని తన బంధువుల ఇంటికి వచ్చింది. గురువారం రాత్రి కర్నూలుకు వెళ్లడానికి బస్సు టికెట్‌ బుక్‌ చేసుకుంది. అయితే ఆమెను దిగబెట్టాలనుకున్న బంధువులు అత్యవసర పనిపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో పక్కనే ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అప్రైజర్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌కు పద్మను దేవరపల్లి తీసుకువెళ్లి బస్సు ఎక్కించాలని పురమాయించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో అతడు పద్మను బైక్‌పై ఎక్కించుకుని దేవరపల్లి బయలు దేరారు. 6.45 గంటల సమయంలో వీరు చిట్యాల–అన్నదేవరపేట మధ్య రోడ్డుపై ప్ర వహిస్తున్న వరద నీటిలో వెళ్తుండగా ఎదురుగా వస్తు న్న లారీ లైట్ల వల్ల దారి కనపడక కొద్దిగా పక్కకు వెళ్లడంతో బండి అదుపుతప్పి కొవ్వాడ కాలువలో పడిపో యి కొట్టుకుపోయారు. కాలువ గట్టున ఉన్న చెట్టుకొమ్మలను పట్టుకుని పద్మ తనను రక్షించాలని కేకలు వేయడంతో అడుగా వెళ్తున్న వారు ఆమెను రక్షించారు. కాగా విజయకుమార్‌ బైక్‌తో పాటు కాలువలో కొట్టుకుపోయాడు. చిట్యాలకు చెందిన పీతల ప్రసాద్‌ బాబు, మరి కొందరు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న పద్మను ఇంటికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. ప్రమాద సంఘటనపై ప్రసాద్‌బాబు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి సమాచారం ఇవ్వగా, వారు రాత్రి వచ్చి కాలువలో గాలించారు. అయితే ఈ ప్రాంతం చీకటిగా ఉండడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళ్లిపోయారు. శుక్రవారం సాయంత్రం వరకు విజయకుమార్‌ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

జాడలేని పోలీసులు,

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

విజయ్‌కుమార్‌ గల్లంతైన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సిబ్బంది అందరూ ఎన్నికల విధుల్లో ఉన్నారని చెప్పినట్టు స్థానికులు చెప్తున్నారు. ఘటన గురువారం రాత్రి జరగ్గా శుక్రవారం సైతం ఎవరూ స్పందించకపోవడం శోచనీయం. కాగా వైఎస్సార్‌ సీపీ నేత ప్రసాద్‌ బాబు సమాచారంతో గురువారం రాత్రి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలం చీకటిగా ఉన్నందున చేసేది లేక వెళ్లిపోయారు. కాగా శుక్రవారం ఫోన్‌ పదే పదే ఫోన్‌ చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement