సాక్షి, రాజమహేంద్రవరం: పరిషత్ ఎన్నికల వేళ కూటమి అభ్యర్థులను ప్రజా వ్యతిరేకత వెంటాడుతోంది. దీంతో వారు ప్రలోభాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 28 నెలలు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం.. ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం భారంగా మారడం.. కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేరకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ పరిస్థితుల్లో అర్నబ్ తుపాను అన్నదాతలపై మరో పిడుగులా పడింది. జిల్లాలో వరి పంట దెబ్బతిని, 80 వేల మంది రైతులు నష్టపోయినట్లు అంచనాలున్నాయి. రూ.8,750 కోట్ల మేర నష్టం వాటిల్లినప్పటికీ పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన పరిషత్ ఎన్నికల్లో రైతుల అసంతృప్తి తమకు ప్రతికూలంగా మారుతుందేమోనని కూటమి అభ్యర్థులు కలవరపడుతున్నారు.
మద్యం, డబ్బు పంపిణీకి..
ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని, ముఖ్యంగా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొందరు కూటమి అభ్యర్థులు ప్రలోభాల మార్గాన్ని ఎంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్లకు భారీగా మద్యం పంపిణీ చేయడంతో పాటు నగదు వెదజల్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. గురువారం పోలింగ్ ప్రారంభమయ్యేలోగా వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా అధికారం అండతో దోచుకున్న రూ.కోట్లను ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు కొందరు కూటమి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం అధిక ధరలకు విక్రయించి దోచుకున్నవి, ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా సంపాదించిన డబ్బులనే ప్రస్తుత ఎన్నికల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం అభ్యర్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఫ ఓటమి నుంచి
బయటపడేందుకు ఎత్తుగడ
ఫ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు
కూటమి ప్రయత్నాలు


