దగాకోరు ప్రభుత్వమిది | - | Sakshi
Sakshi News home page

దగాకోరు ప్రభుత్వమిది

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

రాజమహేంద్రవరం రూరల్‌: ప్రస్తుతం దగాకోరు ప్రభుత్వ పాలన సాగుతుందని, ఎన్నికల హామీల అమలును చంద్రబాబు పూర్తిగా విస్మరించారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. కోలమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మోటార్‌ సైకిళ్ల ర్యాలీని ఆయన, జెడ్పీటీసీ అభ్యర్థి మెల్లిమి గంగరాజు (గాబ్రియేలు) జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ–1 అభ్యర్థి ఉల్లింగి ప్రతిభ, ఎంపీటీసీ–2 అభ్యర్థిని యనమదల రమ్యశ్రీ, ఎంపీటీసీ–3 అభ్యర్థి షేక్‌ కరీముల్లా (నన్నూ), ఎంపీటీసీ–4 అభ్యర్థిని పిల్లా అపర్ణలకు మద్దతుగా కోలమూరు వీధుల్లో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగ నాయకుడు జక్కంపూడి గణేష్‌, యువత మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిందన్నారు. ఒకపక్క నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుండడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నాయకులు పడాల ప్రసాద్‌, తాటికొండ విష్ణు, పరిమి దుర్గారావు, నల్లిమిల్లి సుబ్బారావు, అల్లాడ శ్రీనివాస్‌, జుత్తుక సుదర్శన్‌, చిన్ని, కొడమంచిలి కోటిబాబు, నవీన్‌ పాల్గొన్నారు.

కొంతమూరులో జెడ్పీటీసీ అభ్యర్థి మెల్లిమి గంగరాజు (గాబ్రియేలు), ఎంపీటీసీ–2 అభ్యర్థిని యనమదల రమ్యశ్రీ, ఎంపీటీసీ–3 అభ్యర్థి షేక్‌ కరీముల్లాలు మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని అభ్యర్థులు కోరారు. ఈ ర్యాలీలో ఎంఎం అలీ, అత్తిలి భీమశంకరం, చెరుకూరి సత్యనారాయణ, షేక్‌చానా, యామన రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ–4 అభ్యర్థి పిల్లా అపర్ణ, పార్టీ నాయకులతో కలసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చెల్లుబోయిన వేణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement