బాబు బూటకం.. జగన్‌ నిజం | - | Sakshi
Sakshi News home page

బాబు బూటకం.. జగన్‌ నిజం

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

● ఓటుతోనే కూటమిని తరిమేద్దాం

● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

కడియం: ఎన్నికల ముందు బూటకపు హామీలు ఇచ్చి చంద్రబాబు జనాన్ని మోసం చేస్తే, గత ప్రభుత్వంలో హామీలన్నీ అమలు చేసి నిజమైన ప్రజానేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరొందారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం వీరవరంలో ఆయన స్థానిక నాయకులు రేమళ్ల ప్రసాద్‌తో కలిసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల తరఫున ఇంటింటా ప్రచారం చేశారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీ, ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి, వీరవరం ఎంపీటీసీ యర్రా నాగదేవిలను భారీ మెజార్టీతో గెలిపించాలని, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వెయ్యాలని వేణు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. బియ్యం బస్తా ధర రూ.2,600 దాటిపోతోందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.. లేనట్టా అని వేణు దుయ్యబట్టారు. యువత, మహిళలు, రైతులు.. ఇలా అన్నివర్గాలను మోసం చేసి చంద్రబాబు గద్దెనెక్కారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అర్హుల ఇంటికే పథకాలు చేరాయని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గత జగన్‌ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు పాలనకు తేడాను గమనించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటెయ్యాలని కోరారు. ప్రచారంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీతోనే రాష్ట్రానికి మేలు

కడియం: వైఎస్సార్‌ సీపీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు అన్నారు. ఆదివారం కడియంలో ఆయన పార్టీ రాష్ట్రకార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు)తో కలసి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జెడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీ, ఎంపీటీసీ అభ్యర్థులు పెంకే రామకృష్ణ, దాసరి చంద్రకళ, గుడాల వీరమణి, సాకా మరియమ్మలను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఓటర్లను కలసి గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. రైతులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమాన్ని తెలిపారు.

వీరవరంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న

పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తదితరులు

కడియంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న

మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement