ఇంకా ముంపులోనే.. | - | Sakshi
Sakshi News home page

ఇంకా ముంపులోనే..

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

● కొవ్వాడ వరి చేల పరిస్థితి

● కుళ్లిపోతున్న పంటలు

దేవరపల్లి: అర్నబ్‌ తుపాన్‌ ప్రభావంతో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి చేలు ఇంత వరకు తేరుకోలేదు. నీటిలో మునిగి ఉన్న పంట పొలాలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి వరి చేలు నీటిలో మునిగి ఉన్నాయి. ప్రధానంగా కొవ్వాడ కాలువ ముంపునకు గురైన గౌరీపట్నం, వెంకటాయపాలెం, చిట్యాల, ఐ.పంగిడి, కాపవరం గ్రామాల్లోని వందలాది ఎకరాల్లోని వరి చేలు పూర్తిగా నీట మునిగాయి. కోతకు వచ్చిన చేలు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయినట్టు రైతులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో కోత కోసి పంటను ఇంటికి తెచ్చుకొనేవారమని వాపోతున్నారు. పంట నష్ట పరిహారం కాగితాలకే పరిమిత మవుతుందని, గత ఏడాది తుపానుకు దెబ్బతిన్న పంటలకు ఇంత వరకు ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూడడం తప్ప నష్టపోయిన రైతులను ఆదుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. కొవ్వాడ కాలువను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తే ముంపు సమస్య ఉండదని అంటున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు సకాలంలో నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement