ఎన్నికల వేళ ఏం చెప్పారంటే...
నిరుద్యోగులందరికీ నెలకు రూ.3 వేల భృతి చెల్లించి ఆర్థికంగా అండగా నిలుస్తాం. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
ఎన్నికలయ్యాక ఏం చేశారంటే...
నెలకు రూ.3 వేలు చెల్లించడం మాట దేవుడెరుగు... అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందరున్నారు.. వారి పరిస్థితి ఏంటి.. వారికి ఎలా భరోసా కల్పించాలన్న మార్గదర్శకాలేవీ గడిచిన 28 నెలల్లో విడుదల చేయనేలేదు. జిల్లాలో సుమారు 1.3 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం నిరీక్షిస్తున్నారు. వారందరికీ ఒక్కొక్కరికీ రూ.84 వేల చొప్పున కూటమి ప్రభుత్వం బకాయి పడింది. మరోవైపు నిరుద్యోగులను మభ్య పెట్టేందుకు డీఎస్సీ నియామకాలు చేపట్టినప్పటికీ వాటిపై వచ్చినన్ని ఆరోపణలు దేశంలో ఎక్కడా రాలేదు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ఉద్యోగాలు అమ్మేసుకున్నారని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వంలో చలనం లేకపోయింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేసినా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ధైర్యం చేయడం లేదు.


