ఎన్నికల వేళ ఏం చెప్పారంటే...:
అన్నదాతలకు అండగా నిలుస్తాం. కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరిట రూ.20 వేలు చెల్లిస్తాం. రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకుంటాం.
ఎన్నికలయ్యాక ఏం చేశారంటే...
అన్నదాత సుఖీభవ పేరిట సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పినప్పటికీ రూ.14 వేలే ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలను తామే ఇస్తున్నట్లు చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. మరోవైపు మద్దతు ధర కల్పించి అండగా నిలవడం మాట అటుంచితే గత ఏడాది మోంథా తుపాను వల్ల తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 50 వేల మంది రైతులు నష్టపోతే పరిహారమివ్వకుండా కథలు చెప్పారు. ఇప్పటికీ అన్నదాతలకు సాయం అందలేదు. యంత్రసిరి పేరుతో రెండేళ్లుగా మోసం చేస్తున్నారే తప్ప ఒక్కరికీ యంత్రాలు అందించలేదు. వ్యవసాయ యాంత్రీకరణ అంతా మాటల్లోనే తప్ప కార్యాచరణ లేదు. తాజాగా అర్నబ్ దెబ్బకు జిల్లాలో 60 వేలకు పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఆదుకుంటామనే భరోసా చంద్రబాబు అండ్ కో రైతులకివ్వడం లేదు.


