కోరుకొండ: వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. దోసకాయలపల్లిలో సోమవారం రాత్రి జనసేనకు చెందిన 70 మంది తిరిగి వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి జక్కంపూడి రాజా సాదరంగా ఆహ్వానించారు. దోసకాయలపల్లి ఫిషర్‌మెన్ సొసైటీ అధ్యక్షుడు గడమాల కొండ, ఉపాధ్యక్షుడు గుమ్మడి శేఖర్, కార్యదర్శి పీతల గోవిందరాజు ఆధ్వర్యంలో 70 మంది చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రి నాగేశ్వరరావు, కడవల శివ, ఎంపీటీసీ అభ్యర్థి కర్రి నాగదుర్గా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం
రంగంపేట: ఎన్నికల హామీలను నేరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్సార్ సీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు విమర్శించారు. సుభద్రంపేటలో సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు లంక చంద్రన్న, మాగాపు వెంకట రమణ, ముంగి గంగరాజు, మాగాపు కాశీ ఈశ్వరుడు సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వెంకటాపురం గ్రామానికి చెందిన దంగేటి రాజు కుటుంబ సభ్యులు, బోడెం చిన్న రాంబాబు, సలాది ప్రసన్నతో పాటు మరికొందరికి పేపకాయల రాంబాబు, లంక చంద్రన్న వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
గోపాలపురం నియోజకవర్గంలో..
దేవరపల్లి: గోపాలపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు మారుబోయిన నాగ దుర్గాప్రసాద్ సోమవారం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు వెల్లంకి సుబ్రహమణ్యం పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
రాయవరం: మండలంలోని పసలపూడిలో సోమవారం టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు జరిగాయి. ఈ గ్రామానికి చెందిన కొవ్వూరి వెంకటేశ్వరరావు, బుర్రే వెంకన్న తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి త్రిమూర్తులు సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చింతా సుబ్బారెడ్డి, చింతా రామ్మోహన్‌రెడ్డి, కొల్లి హనుమాన్ ప్రసాద్, పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి, డీఆర్‌సీ రెడ్డి, పోతంశెట్టి సత్తిబాబు, చింతా సురేష్‌రెడ్డి, మల్లిడి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి సుధాకరరెడ్డి పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
ఫ పార్టీలో పలువురి చేరిక


