కడియం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు అన్నారు. కడియపులంక పంచాయతీ పరిధి వెంకాయమ్మపేటలో సోమవారం వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్ధి కొత్తపల్లి శివాజీ, ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజేశ్వరితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో పడుతున్న ఇబ్బందులను తీరాలంటే వైఎస్ జగన్కు ప్రజలంతా మద్దతుగా నిలిచి, ఫ్యాన్గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, పార్టీ నాయకులు తాడాల విష్ణుచక్రవర్తి, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కడియంలో వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి గిరజాల వీర్రాజు పార్టీ ఎంపీటీసీ అభ్యర్ధులను గెలిపించాలని విస్తృత ప్రచారం చేపట్టారు.
ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు
చెల్లుబోయిన వేణు
ఫ ముమ్మరంగా ప్రచారం


