పెరవలి: ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యముంది. నిబంధనల మేరకు దేశ పౌరులందరూ వాటిలో పోటీ చేయవచ్చు. రాజ్యాంగ బద్ధంగా లభించిన ఈ హక్కు చంద్రబాబు పాలనలో ప్రజలకు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు దూరమైంది. ఆ పార్టీ నాయకులు, పోలీసులు కలిసి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించి, నామినేషన్లను విత్‌డ్రా చేయిస్తున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే..
కొవ్వూరు మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. వీటిలో 6, 15, 18 వార్డుల వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్ల గదిలోనే విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. దీంతో ఎవరితో చెప్పుకోవాలో తెలియక వారందరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీనితో ఈ వార్డులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల కేంద్రలోనే తిష్ట వేసి అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని, దీనికి అధికార యంత్రాంగం, పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించారని సమాచారం. టీడీపీ నాయకులతో పాటు పోలీసులు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి కేసులు పెడతామని, వారి ఆస్తులను ఆక్రమించుకుంటామనడం, వారి రేషన్ డిపోలు తొలగిస్తామని, కేసులు బనాయిస్తామని, పంట చేలు ధ్వంసం చేస్తామని, స్థలాలు ఆక్రమణలకు గురవుతాయని అభ్యర్థులతో పాటు ఇంట్లో పెద్దలను బెదిరించినట్టు తెలిసింది. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డులు ఆ అభ్యర్థుల వద్ద ఉన్నాయి. నామినేషన్ వేయటానికి, ఉపసంహరణకు వేదికై న మున్సిపల్ కార్యాలయంలోనే టీడీపీ నేతలు తిష్ట వేసి బెదిరింపులకు పాల్పడటం దారుణం.
మున్సిపల్ కమిషనర్ తీరుపై విమర్శలు
మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే రాత్రి 10 గంటలకు కూడా తుది జాబితాను నోటీస్ బోర్డులో పెట్టలేదు. ఆయనను ఫోన్‌లో ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. విలేకర్లను ఆ సమీపంలోకి రాకుండా పోలీసులతో పహా రా పెట్టారు. అధికారులు, పోలీసులు, కూటమి నేతలు ఒక్కటై ఈ దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.
·˘ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు
బెదిరింపులు
·˘ ఏకమైన కూటమి నాయకులు,
పోలీసులు, అధికారులు
·˘ బలవంతంగా నామినేషన్ల విత్ డ్రా
·˘ కొవ్వూరు మున్సిపాలిటీలో ఘటన


