రెండో రోజు..
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: పరిషత్ పోరులో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం జోరందుకుంది. బుధవారం అంతంతమాత్రంగా అతి తక్కువ మందే నామినేషన్లు వేశారు. 21 జెడ్పీటీసీ స్థానాలకు తొలి రోజు ముగ్గురే నామినేషన్లు వేయగా, రెండో రోజు మొత్తం 51 మంది నామినేషన్లు అందజేశారు. వైఎస్సార్ తరఫున 17 సెట్లు, టీడీపీ నుంచి 15, జనసేన 9, బీజేపీ 2, కాంగ్రెస్ 7, బీఎస్పీ అభ్యర్థులు 4 నామినేషన్లు వేశారు. మరోవైపు మండల కేంద్రాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని 412 స్థానాలకు తొలిరోజు 198 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. రెండో రోజు 898 సెట్లు వేయడం మొత్తం సంఖ్య 1,096కు చేరింది. వైఎస్సార్ సీపీ తరఫున 512, టీడీపీ నుంచి 366, జనసేన నుంచి 144, బీజేపీ నుంచి 39, ఇతరులు 35 నామినేషన్లు వేశారు.
కూటమిలో కుదరని పొత్తు!
పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజుకి చేరినప్పటికీ కూటమి పార్టీల మధ్య పొత్తు కుదరలేదని తెలుస్తోంది. ముఖ్యంగా చైర్‌పర్సన్ స్థానం ఏ పార్టీకి కేటాయిస్తారో తేలకపోవడంతో నామినేషన్లు వేసేందుకు కూడా కొంత మంది అభ్యర్థులకు స్పష్టత లేకుండా పోయింది. ఇక్కడి జెడ్పీ పీఠాన్ని తమకే కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ తరఫున ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఓ మహిళా నాయకురాలు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జెడ్పీ పీఠాన్ని తమకే కేటాయించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి కూడా ఆశావహుల జాబితా ఎక్కువగానే ఉంది. మరోవైపు తమకు రెండు మూడు జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అవకాశమిస్తే చాలు అన్నట్లు బీజేపీ స్థానిక నాయకత్వం ఉన్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పీఠం ఎవరికి కేటాయిస్తున్నారో తెలియకపోవడంతో జిల్లాలోని ఆయా జెడ్పీటీసీ స్థానాల నుంచి ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలో కూడా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
● స్పష్టత, సఖ్యత లేకపోవడంతో కొవ్వూరు స్థానం కోసం టీడీపీ రెండు, బీజేపీ 1 నామినేషన్ వేశాయి.
● గోకవరం, కోరుకొండ, నిడదవోలు, రాజానగరం, రాయవరం, ఉండ్రాజవరం జెడ్పీటీసీ స్థానాలకు కూటమి పార్టీల నుంచి ఒక్క నామినేషనూ పడలేదు.
● మండలాల్లోని కొన్ని ఎంపీటీసీ స్థానాలకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశముందని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.
ఎంపీటీసీ సభ్యుల నామినేషన్లు
మండలం వైఎస్సార్ సీపీ కూటమి ఇతరులు మొత్తం
అనపర్తి 23 22 4 49
బిక్కవోలు 30 21 2 53
చాగల్లు 27 30 1 58
దేవరపల్లి 29 37 8 74
గోకవరం 17 21 1 39
గోపాలపురం 24 35 0 59
కడియం 21 17 0 38
కపిలేశ్వరపురం 18 26 1 45
కోరుకొండ 36 31 3 70
కొవ్వూరు 28 31 3 62
మండపేట 27 20 1 48
నల్లజర్ల 22 39 1 62
నిడదవోలు 15 17 0 32
పెరవళి 18 21 3 42
రాజమండ్రి రూరల్ 7 4 0 11
రాజానగరం 52 46 3 101
రంగంపేట 27 26 0 53
రాయవరం 21 27 0 48
సీతానగరం 34 18 2 54
తాళ్లపూడి 25 39 0 64
ఉండ్రాజవరం 11 21 2 34
జెడ్పీటీసీ సభ్యుల నామినేషన్లు
మండలం వైఎస్సార్ సీపీ కూటమి ఇతరులు మొత్తం
అనపర్తి 1 1 0 2
బిక్కవోలు 2 2 0 4
చాగల్లు 0 1 3 4
దేవరపల్లి 2 1 0 3
గోకవరం 1 0 1 2
గోపాలపురం 0 1 0 1
కడియం 3 1 1 5
కపిలేశ్వరపురం 2 2 0 4
కోరుకొండ 0 0 0 0
కొవ్వూరు 0 3 2 5
మండపేట 2 4 0 6
నల్లజర్ల 0 2 0 2
నిడదవోలు 0 0 1 1
పెరవళి 0 1 1 2
రాజమండ్రి రూరల్ 0 1 0 1
రాజానగరం 1 0 0 1
రంగంపేట 0 2 0 2
రాయవరం 1 0 0 1
సీతానగరం 2 2 0 4
తాళ్లపూడి 0 2 1 3
ఉండ్రాజవరం 0 0 1 1
జెడ్పీటీసీలకు 54, ఎంపీటీసీలకు 1,096 నామినేషన్లు
జెడ్పీ కార్యాలయం వద్ద
ఉదయం నుంచి సందడి
నేడు మరిన్ని వేసే అవకాశం


