నిడదవోలు: సమాజంలో అసమానతలను తొలగించి ప్రజలకు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలనేది వైఎస్సార్ సీపీ ప్రధాన లక్ష్యం. మన రాజ్యాంగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలైన విశ్రాంత బ్యాంక్ మేనేజర్ వేదాల విజయలక్ష్మిని ఆ పార్టీ ఎంపిక చేసింది. దీంతో ఆమె ఇప్పటికే అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు కూడగట్టుకున్నారు. బ్యాంకు మేనేజర్‌గా రిటైరైన తర్వాత కూడా ఆమె ఇంటికే పరిమితం కాకుండా పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో రోటరీక్లబ్ ఆఫ్ నిడదవోలు శాఖ అధ్యక్షురాలిగా సమాజంలో విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలు అందించి గుర్తింపు పొందారు. అందరికీ సుపరిచితురాలైన విజయలక్ష్మి రోటరీ సేవా సంస్థలతో పాటు బ్యాంకు మేనేజర్‌గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి నిడదవోలు పట్టణంలో సామాజిక సేవలో చెదరని ముద్ర వేసుకున్నారు. ఆమె తండ్రి వేదాల అజయ్‌కుమార్ ప్రసాద్ హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీసులో ఆడిట్ అధికారిగా పని చేశారు. ఆమె తన విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే ప్రారంభించారు. అక్కడి వనిత మహా విద్యాలయలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. 1986లో తణుకులో ఆంధ్రాబ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి 2017–19లో ఏలూరు ఆశ్రమం ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా సేవలందించారు. అనంతరం రేలంగి, ఆలమూరు బ్రాంచిల్లో పనిచేస్తూ 1990 నుంచి 2022–23 సంవత్సరంలో నిడదవోలు శాఖలో 14 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి మేనేజర్‌గా రిటైరయ్యారు.
కుటుంబమంతా విద్యావంతులే..
వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి వేదాల విజయలక్ష్మి కుటుంబమంతా ఉన్నత విద్యావంతులే. ఆమె భర్త వేదాల విజయప్రసాద్ ఎంకాం పూర్తి చేశారు. ఆమె ఇద్దరు కుమారులు ప్రశాంత్, భరత్ ఇంజినీరింగ్ చేశారు. కోడళ్లు అమూల్య ఎమ్మెస్సీ పూర్తి చేశారు. మరో కోడలు దివ్య ఎంటెక్ పూర్తి చేశారు. బ్యాంకు మేనేజర్‌గా అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తిగా విజయలక్ష్మి రాజకీయాల్లోకి వచ్చి సామాజిక సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
నిడదవోలు వైఎస్సార్ సీపీ మున్సిపల్
చైర్మన్ అభ్యర్థిగా విజయలక్ష్మి
మహిళా సాధికారితకు కృషి
విద్యావంతురాలు, సమాజ సేవకురాలు
వ్యక్తిగత వివరాలు
పేరు : వేదాల విజయలక్ష్మి
వయసు : 63 ఏళ్లు
చదువు : బీఏ (హైదరాబాద్)
వృత్తి : ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌గా
ఉద్యోగ విరమణ
భర్త : విజయ ప్రసాద్
సంతానం : ఇద్దరు కుమారులు


