నామినేషన్లలో అల్లర్లు వద్దు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లలో అల్లర్లు వద్దు

Oct 23 2026 12:15 AM | Updated on Oct 23 2026 12:15 AM

తాళ్లపూడి: నామినేషన్ల సమయంలో అల్లర్లకు తావివ్వవద్దని పోలీసు సిబ్బందికి ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆదేశించారు. తాళ్లపూడి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. అక్కడ భద్రతా చర్యలపై ఆరా తీసి, 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. స్థానికంగా గుమిగూడిన జనాలపై, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వాహనాలు, టెంట్లను తొలగింపజేశారు. నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కొవ్వూరు రూరల్‌ సీఐ విజయబాబు, ఎస్సై రామకృష్ణ ఆయన వెంట ఉన్నారు. అంతకు ముందు ఉదయం డీఎస్పీ దేవకుమార్‌ ఈ కేంద్రానికి వచ్చి బందోబస్తు పరిశీలించారు.

దేవరపల్లి: గోపాలపురంలోని ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ పరిశీలించారు. కేంద్రం పరిసరాల్లో బందోబస్తు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, నిఘా వ్యవస్థలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు

నమోదు వేగవంతం చేయాలి

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా నూతన రూపకల్పనను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఫారం–19 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమన్వయంతో అర్హులైన వారందరూ నిర్ణీత గడువులోగా ద రఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫారం–19 ద్వారా 72 ఆన్‌లైన్‌, 105 ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కలిపి మొత్తం 177 స్వీకరించడం జరిగిందన్నా రు. దరఖాస్తులను నవంబర్‌6 లోగా అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. వాటిని సహాయ ఓటరు నమోదు అధికారులు, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి, ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలన్నారు. అనంతరం డివిజనల్‌ కార్యాలయంలో ధ్రువీకరణ, కౌంటర్‌ సంతకం పూర్తి చేసి, తుది ఆమోదం కోసం కాకినాడ ఓటరు నమోదు అధికారికి పంపించాలని ఆదేశించారు.

జ్వర పీడితులకు ర్యాపిడ్‌ టెస్టులు

రాజమహేంద్రవరం రూరల్‌: జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి, వారికి డెంగీ కిట్లతో ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.కోమల అన్నారు. ఆమె గురువారం బొమ్మూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో డెంగీ జ్వరాలపై యూపీహెచ్‌సీల హెల్త్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. డెంగీ కేసులు ఏ ఏరియాల్లో ఎక్కువగా వస్తున్నాయో ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. అనుమానిత కేసులను దగ్గరిలోని యూపీహెచ్‌సీలకు పంపించి ర్యాపిడ్‌ టెస్టులు చేయించాలని ఆదేశించారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, జిల్లా ఇన్‌చార్జి మలేరియా అధికారి డాక్టర్‌ సంధ్య మాట్లాడుతూ ఇంటింటా సర్వే చేసే విధానాన్ని అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement